కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఈనెల 18న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఈనెల 18న ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. కంటి వైద్య శిబిరానికి వచ్చే వృద్ధులు తమ వెంట ఓటర్ కార్డ్/ఆధార్ కార్డు/రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలను తెచ్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గుంటూరు శంకర నేత్ర వైద్యశాలకు చెందిన వైద్య బృందం వృద్ధులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహిస్తుందన్నారు. కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.