రాప్తాడు: శారద నగర్ లో రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ఆధ్వర్యంలో న్యాయభేరి సభకు రావాలని ఉద్యోగులను ఆహ్వానించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో శారద నగర్ వద్ద ఆదివారం ఐదున్నర గంటల సమయంలో రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు నాగభూషణం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ నాయక్ నంద్యాలలో నిర్వహించే న్యాయభేరి సభకు ఉద్యోగులు తరలిరావాలని ఉద్యోగులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్పిఎఫ్ నాగభూషణం నారాయణ నాయక్ మాట్లాడుతూ జూలై 19న నంద్యాల్లో నిర్వహించే న్యాయభేరి సభకు ఉద్యోగులంతా తరలిరావాలని అందులో భాగంగా మాజీ రిజిస్టర్ శ్రీరాములు డాక్టర్ నాగేశ్వరరావును ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందర్నీ కలిసి సభకు రావాలని ఆహ్వానించడం జరిగిందని ఆర్ పి ఎఫ్ జాతీయ అధ్యక్షుడు నాగభూషణం, నారాయణ్ నాయక్ పేర్కొన్నారు.