రాప్తాడు: పాతపాలెంలోఅనంతపురం వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రీజినల్ చైర్మన్ నాగరాజ
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం పాతపాలెం గ్రామంలో బుధవారం 12 గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు పాతపాలెం నుంచి అనంతపురం వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత రీజినల్ చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ పాతపాలెం గ్రామంలో బస్సు సౌకర్యం లేదని తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న సందర్భంలో తన దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని అందులో భాగంగా ఈరోజు అనంతపురం నుంచి పాతపాలెం వరకు ఉదయం సాయంకాలం ఆర్టిసి బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగిందని పరిటాల సునీత, నాగరాజు పేర్కొన్నారు.