కనిగిరి: పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి పట్టణంలో రాష్ట్ర సాంఘిక ,సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మంత్రి స్థానిక శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి స్వయంగా చీపురు పట్టిన మంత్రి స్వామి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమంలో మంత్రి పాల్గొని కార్యక్రమానికి హాజరైన వారిచే ప్రతిజ్ఞ చేయించారు.