కనిగిరి: చంద్రశేఖరపురంలో యోగాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
చంద్రశేఖరపురంలో యోగాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చని ఆమె సూచించారు. పూర్వం యోగులు, ఋషులు యోగా సాధన చేసి మంచి ఫలితాలను సాధించాలని, వారి బాటలో ప్రతి ఒక్కరూ నడిచి యోగ సాధన చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.