సంతనూతలపాడు: చీమకుర్తిలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీపై దాడులు
చీమకుర్తి లో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీపై ఇటీవల అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈ దాడుల్లో ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీలో నిబంధనలను ఉల్లంఘించారని ఆయనకు నోటీసులు జారీచేశారన్న సమాచారం చీమకుర్తి పట్టణంలో శుక్రవారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 25 వేల క్యూబిక్ మీటర్ల మేర అక్రమంగా గ్రానైట్ క్వారీలో మైనింగ్ పాల్పడినట్లు సమాచారం. చీమకుర్తిలో మరెన్నో గ్రానైట్ క్వారీలు ఉండగా అధికారులు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి క్వారీపైనే దాడులు నిర్వహించడం చర్చకు దారి తీసింది.