సంతనూతలపాడు: చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే ప్రయాణికులు సాహసం చేయాల్సిందే
చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే సాహసం చేయాల్సిందే. శ్రీ శక్తి పథకం, దివ్యాంగ శక్తి పథకం వల్ల ప్రాంగణం ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడిపోతుంది. సోమవారం కూడా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.రద్దీకి తగ్గట్లు బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సు వస్తుందంటే ప్రయాణికులు బస్సు ఎక్కటానికి పోటీ పడుతున్నారు. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.