ఉరవకొండ: వివిధ ఇంజనీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆర్.అండ్.బి, హెచ్.ఎల్.సి, హెచ్ఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్, ఇతర ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఇంజనీరింగ్ సెక్టార్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.