కనిగిరి: పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరిలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాల వద్ద స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం కనిగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాఠశాల వద్ద పరిసరాలను జెసిబి యంత్రాలతో, మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బాలికొన్నత పాఠశాల వద్ద రహదారిని వెడల్పు చేసి అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. కమిషనర్ శ్రీధర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.