సంతనూతలపాడు: చీమకుర్తి మున్సిపాలిటీలో ఒకేసారి పన్నులు చెల్లించే వారికి 5 శాతం రాయితీ : చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య
చీమకుర్తి పట్టణంలోని ప్రజలకు చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య సోమవారం పలు కీలక సూచనలు చేశారు. 2026 -27 ఆర్థిక సంవత్సరానికి ఏక మొత్తంలో ఆస్తి పన్ను మరియు కొళాయి పన్ను, ఖాళీ స్థలాలకు పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపారు. 2025-26 సంవత్సరానికి పూర్తి బకాయిలను చెల్లించే వారికి 50% వడ్డీ రైతు కల్పిస్తున్నట్లు తెలిపారు. చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సకాలంలో పన్నులు చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.