కనిగిరి: పట్టణంలో వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహా సమాధి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి మహా సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.