రాయదుర్గం: ఇచ్చిన హామీలు రెండేళ్లలో అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే : టిడిపి జిల్లా అధ్యక్షులు పూలనాగరాజు
సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని TDP జిల్లా అధ్యక్షుడు, RTC జోనల్ చైర్మన్ పూలనాగరాజు అన్నారు. శనివారం రాయదుర్గంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన Way 2 న్యూస్ తో మాట్లాడారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా సాగుతోందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని పూలనాగరాజు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.