కనిగిరి: పట్టణంలోని శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధిలో మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సారెను బహుకరించిన మహిళలు
కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొలువైన శ్రీ సరస్వతి దేవి మందిరంలో సోమవారం పౌర్ణమి మరియు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో సరే సారె ను సమర్పించారు. పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో విశేషం కుంకుమార్చనలు నిర్వహించి, అమ్మవారికి సారెను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.