ఉరవకొండ: ఆవులెన్న గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల వినతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఆవులన్న గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని శుక్రవారం గ్రామస్తులు మండల తహసిల్దార్ అనిల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. కళ్యాణదుర్గం బెలుగుప్ప ప్రధాన రహదారి నుండి ఆవులన్న గ్రామానికి వెళ్లే లింక్ రోడ్డు 26 అడుగుల వెడల్పుతో గుండ్లపల్లి రస్తాగా పిలువబడుతూ రెవిన్యూ రికార్డుల్లో ఉందని అయితే రహదారిలో 80 మీటర్ల పొడవునా రావి హరి ప్రసాద్ రహదారిని ఆక్రమించుకుని 11 అడుగులు వెడెల్పు మాత్రమే రహదారిని వదలి మిగులు రహదారిని ఆక్రమించుకున్నారని దీంతో ఆర్టీసీ బస్సు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని సమస్యను పరిష్కరించాలని తహసిల్దార్ ను కోరారు.