కొండపి: జరుగుమల్లి మండలంలోని వెలుగు కార్యాలయాన్ని తనిఖీ చేసి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన పిడి నారాయణ
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని వెలుగు కార్యాలయాన్ని డిఆర్డిఏ పీడీ నారాయణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న ఈ నారి/సీఆర్పీల శిక్షణ కార్య క్రమాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలో శ్రీనిధి నిధుల దుర్వినియోగంపై ప్రాధమిక విచారణ చేపట్టారు. కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్ ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.