సంతనూతలపాడు: చీమకుర్తిలో మితిమీరిన వేగంతో వెళుతున్న టిప్పర్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ సిఐ దాసరి ప్రసాద్
చీమకుర్తి పట్టణంలోని పలు వీధిలో పగలు రాత్రి తేడా లేకుండా కంకర టిప్పర్లు డ్రైవర్లు వేగంగా నడుపుతూ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్పందించిన సీఐ దాసరి ప్రసాద్ గురువారం వేగంగా వెళుతున్న టిప్పర్లను ఆపి, డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మితిమీరిన వేగంతో టిప్పర్లను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టిప్పర్ డ్రైవర్లు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.