కనిగిరి: మండలంలో గాలివాన బీభత్సం, కనిగిరి-కందుకూరు రహదారిలో నేలకొరిగిన భారీ వృక్షాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం
కనిగిరి మండలంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కనిగిరి-కందుకూరు రహదారిలో భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో జెసిబి యంత్రాలతో ఒంటిగంట సమయం వరకు అధికారులు శ్రమించి, రోడ్లపై పడ్డ భారీ వృక్షాలను తొలగించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు