సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలోని శ్రీ నాగేంద్ర స్వామి వారి ఆలయంలో వైభవంగా కలశ ప్రతిష్టాపన కార్యక్రమం
చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ నాగేంద్ర స్వామి వారి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా కలస ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ కలస ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.