రాప్తాడు: గొల్లపల్లి గ్రామంలో మొహరం వేడుకల్లో గొడవలు జరగకుండా నిర్వహించుకోవాలని గ్రామస్తులను సూచించిన రాప్తాడు సిఐ వెంకటేష్
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు మొహరం వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామంలో మొహరం వేడుకలను గ్రామస్తులంతా మతాలకతీతంగా నిర్వహించుకోవాలని పండగ సందర్భంగా ఎలాంటి గొడవలు అల్లర్లు లేకుండా అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా మొహరం వేడుకలు నిర్వహించుకోవాలని గ్రామస్తులను కోరడం జరిగిందని రాప్తాడు సిఐ వెంకటేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ శ్రీనివాసులు సుధాకర్ ఇతర పోలీస్ సిబ్బంది అంతా పాల్గొన్నారు.