వికారాబాద్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో సంకల్ప విద్యపీట్లో సైన్స్ ఎక్స్పరిమెంట్ నిర్వహించిన విద్యార్థులు.
ఈరోజు ప్రముఖ భౌతిక పరిశోధకుడు నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని సంకల్ప విద్యాపీట్లో విద్యార్థులు సైన్స్ ఎక్స్పరిమెంట్ ఘనంగా నిర్వహించారు. పలు సైన్స్ ప్రయోగాలు నిర్వహించి, వచ్చిన అతిధులకు సైన్స్ గురించి వివరించారు. సైన్స్ వల్లనే దేశం అభివృద్ధి జరుగుతుందని,కరోనా వంటి కష్ట కాలంలో కూడా మన దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారుచేసి ఎన్నో దేశాలకు సహాయం అందించారని గుర్తు చేశారు.