వికారాబాద్: జిల్లాలోని కోడంగల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమాలు వర్తిస్తుంది - కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం లో నాలుగు మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమాలు వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఈవీఎంల గిడ్డంగి ఆవరణలో, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఈవీఎంల, మొదటి తనిఖీ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మహబూబ్నగర్ శాసనమండలి ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉందన్నారు.