వికారాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా పట్టణంలోని ఓ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. బుధవారం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ పరీక్ష కేంద్రంలో 593 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 28 మంది గైర్హాజరు అయ్యారని కలెక్టర్‌కు అధికారులు వివరించారు.