వికారాబాద్: జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, 5 నిమిషాలు లేటుగా వచ్చారని 3 విద్యార్థులను పరీక్షకు అనుమతించని అధికారులు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. ఇప్పటికే నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించమని అధికారులు ముందే చెప్పడం జరిగింది. అయితే వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్సులు లేటుగా రావడంతోనే ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు బోరున వినిపిస్తూ వెనుతిరిగి వెళ్లిపోయారు.