రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో సందర్శించి విద్యార్థినిల సమస్యలను అడిగి తెలుసుకున్న సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ విద్యార్థినీలతో సమావేశమై యూనివర్సిటీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ తాను చదువుకున్న యూనివర్సిటీలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు భవిష్యత్తులో విద్యార్థినిలతో కలిసి పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉంటారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు సిపిఐ నేతలు పాల్గొన్నారు.