కనిగిరి: పొగాకు రైతులకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించేలా అధికారులు కృషి చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించి, రైతుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించే విధంగా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కష్టపడి పండించిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పొగాకు వేలం కేంద్రం అధికారులు, రైతులు పాల్గొన్నారు.