కనిగిరి: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కనిగిరి తహసిల్దార్ జయలక్ష్మి
కనిగిరి మండలంలోని ఏరువారిపల్లి రామాలయం సెంటర్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కనిగిరి మండల తహసిల్దార్ జయలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. దాతలు ముందుకు వచ్చి కనిగిరి మండలంలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని తహసిల్దార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.