కొండపి: సింగరాయకొండలో పహల్గాంలో
పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ నల్లరిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు
సింగరాయకొండలో ముస్లింలు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం నల్లరిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాద చర్యలను మానుకోవాలన్నారు. మతోన్మాదం పేరుతో అమాయకులైన ప్రజల ప్రాణాలు తీయడం మంచిది కాదని తెలిపారు.