కామేపల్లి: గంజాయి రవాణా: నలుగురికి పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా
2022లో ఖమ్మం రైల్వే స్టేషన్లో 101 కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడిన మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఇన్ఛార్జ్ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.