కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా స్వామివారి పల్లకి సేవోత్సవం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకిని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.