ఉరవకొండ: ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ను కలసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఢిల్లీ పర్యటనలో ఉన్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ శనివారం ఢిల్లీ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు కేంద్ర సహకారం గురించి కేంద్ర మంత్రివర్యులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు చర్చించారు.