కనిగిరి: పామూరు మండలం బోట్ల గూడూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
పామూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన పామూరు మండలం బొట్లగూడూరు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద చెర్లోపల్లి మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన చలంచర్ల చిన బ్రహ్మయ్య తన కుటుంబంలో జరిగే వివాహానికి బంధువులను ఆహ్వానించేందుకు బ్రహ్మయ్య తో కలిసి బైక్ పై వెళ్తున్న గ్రామంలో బోట్ల గూడూరు వద్ద మరో పల్సర్ బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో బైక్ పై ఉన్న బ్రహ్మయ్య తో పాటు పల్సర్ బైక్ పైన ఉన్న ముగ్గురికి ఎవరు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.