కనిగిరి: పట్టణంలో పర్యటించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మా గుంట శ్రీనివాసులురెడ్డి
కనిగిరి పట్టణంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కనిగిరిలోని టిడిపి కార్యాలయాన్ని ఆయన సందర్శించగా స్థానిక టిడిపి నాయకులు ఎంపీకి స్వాగతం పలికారు. అనంతరం టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సమావేశం అయ్యారు. కనిగిరి నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మరియు పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తీసుకుంటున్న చర్యలను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టిడిపి నాయకులు వివరించారు.