కనిగిరి: పామూరు మండలం వెంకటాపురం గ్రామ శివారులో పేకాట శిబిరం పై పోలీసుల దాడులు, పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్
పామూరు: పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేసిన సంఘటన పామూరు మండలం వెంకటాపురం గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపురం గ్రామ శివారులో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్సై అనూక్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.24,500 లు నగదును స్వాధీనం చేసుకున్నారు.