రాప్తాడు: ఆర్డిటి క్రీడా మైదానంలో శాప్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులను ఇచ్చిన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఉప్పరపల్లి ఆర్డిటి క్రీడా మైదానంలో గురువారం నాలుగున్నర గంటల సమయంలో శాప్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ముగింపు సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శాప్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి టోర్నమెంట్ మరిన్ని నిర్వహించి ప్రతిభ కనపరిచిన ఫుట్బాల్ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పించడం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు, అనంతరం గెలుపొందిన ఫుట్బాల్ జట్లకు బహుమతులను అందజేశారు.