కనిగిరి: విశ్వనాధపురంలో తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు
కనిగిరి: తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కనిగిరి మండలం విశ్వనాధపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వనాధపురం గ్రామానికి చెందిన వై మోజేష్ అనే యువకుడు మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మోజేష్ మధ్యలో క్రిమిసంహారక మందును కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనిని కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు.