రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో ఫారెన్ లాంగ్వేజెస్ విద్యార్థులకు లాప్టాప్ లను పంపిణీ చేసిన ఎస్.కె పరీక్షల విభాగం డైరెక్టర్ లక్ష్మయ్య
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఎస్కే యూనివర్సిటీలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆర్డిటి ప్రొఫెషనల్ స్కూల్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ విద్యార్థినిలకు ఎస్కే యూనివర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మయ్య లాప్టాప్ లను పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మయ్య, ప్రొఫెసర్ కృష్ణుడు తదితరులు మాట్లాడుతూ ఆర్డిటి ప్రొఫెషనల్ స్కూల్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్ విద్యార్థినీలకు ప్రత్యేకంగా లాప్టాప్ లు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని విద్యార్థి సద్దినం చేసుకొని ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మంచి ఉద్యోగాలు పొందవచ్చని ప్రొఫెసర్ లక్ష్మయ్య కృష్ణుడు పేర్కొన్నారు