రాయదుర్గం: పట్టణంలోని 9 వ వార్డులో హై ఓల్టేజ్ తో కాలిపోయిన గార్మెంట్స్ మిషన్లు, మోటార్లు గృహోపకరణాలు
రాయదుర్గం చౌడేశ్వరిదేవి స్కూల్ వద్ద హై వోల్టేజ్‌తో గురువారం గృహోపకరణాలు పాడయ్యాయి. గార్మెంట్స్ జుక్కీ మిషన్లు, మోటార్లు, ఇళ్లలోని ఫ్రిజ్, వాషింగ్ మిషన్, టీవీ, ఫ్యాన్, బల్బులు కాలిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్ అర్థింగ్ లేని కారణంగా తరచూ హెచ్చుతగ్గులు వస్తున్నాయని బాధితులు చెప్పారు. లైన్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఏడికి పిర్యాదు చేశారు. దీంతో అర్థింగ్ పనులు చేసి సరఫరా పునరుద్ధరించారు. 2 గంటల పాటు కరెంట్ లేక గార్మెంట్స్ ఉత్పత్తి ఆగింది. శాశ్వత పరిష్కారం, నష్టపరిహారం కోరుతున్నారు.