కనిగిరి: వెలిగండ్ల మండలం మరపగుంట్లలో ఎంపీడీవో గంగాధర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు
వెలిగండ్ల మండలంలోని మరపగుంట్ల గ్రామంలో ఎంపీడీవో గంగాధర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని టిడిపి నాయకులు మరియు మండల స్థాయి అధికారులు చీపురు పట్టి గ్రామాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వచ్ఛ పదం ద్వారా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవచ్చన్నారు.