ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని ఇల్లు లేని నిరుపేదలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఆధారాలతో సంబంధిత సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన పేదలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంబంధిత వివరాలకు సమీపంలో ఉన్న సచివాలయాలను సంప్రదించాలని కోరారు.