ఉరవకొండ: బూదగవి గ్రామంలో భూ వివాదంతో మనస్థాపం చెంది రెవిన్యూ, పోలీసుల సమక్షంలోనే పురుగుల మందు సేవించిన రైతు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో భూ వివాదంలో గురువారం రెవెన్యూ, పోలీసుల సమక్షంలోనే పురుగుల మందు తాగాడు రైతు మల్లికార్జున. కోర్టు పరిధిలోనున్న భూమిని కొలవడానికి వెళ్ళిన రెవెన్యూ అధికారులు, కోర్టు పరిధిలో ఉన్న ఆస్తి వివాదం ఎలా కొలతలు వేస్తారంటూ మనస్థాపంతో పురుగులమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసాడు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేసి చికిత్సలు అందించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.