ఉరవకొండ: విడపనకల్లు మండల కేంద్రంలోని గౌరమ్మ బావిలో ఈతకు వెళ్లి ఓబులేష్ అనే హమాలీ నీట మునిగి మృతి
అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలోని గౌరమ్మ బావిలో ఈతకు వెళ్లి ఓబులేసు అనే హమాలీ నీట మునిగి మృతి చెందిన ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులతో కలిసి ఈతకు వెళ్లిన ఓబులేసు నీట మునిగిపోవడంతో స్థానికులు గాలింపు చేపట్టి బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఓబులేసు మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య, ఐదు మంది సంతానం ఉన్నారని కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోవడం మృతుని ఇంట విషాదం నింపింది.