ఉరవకొండ: గ్రామాల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీలు
అనంతపురం జిల్లా ఉరవకొండ ,వజ్రకరూరుతో పాటు విడపనకల్లు మండలాల్లోని పాల్తూరు PHC పరిధిలోని హావలిగి గ్రామo లో సోమవారం పాల్తూరు phc వైద్యాధికారి Dr శివ శంకర్ నాయక్ మరియు సిబ్బంది,మలేరియా పై ర్యాలీ నిర్వహించి,గ్రామం లో అవగాహన కల్పించారు. ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి సమక్షంలో మలేరియా వ్యతిరేక మాస ఉత్సవంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి మలేరియా వ్యాప్తి చెందే కీలక ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ పై అవగాహన కల్పించడం జరిగింది.