కనిగిరి: పామూరు పట్టణంలో కొత్తచెరువును ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ధర్నా
పామూరు పట్టణంలో కొత్తచెరువును ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు హనీఫ్ మాట్లాడుతూ.... పామూరు పట్టణంలో ప్రభుత్వ భూములను, చెరువులను కూడా ఆక్రమణదారులు వదలడం లేదన్నారు. కొత్తచెరువును ఆక్రమించుకున్న భూ బకాసురులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.