కనిగిరి: రాజధాని అమరావతికి పార్లమెంటు ఆమోదం తెలపటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కనిగిరిలో ఎన్డీఏ కూటమి నాయకుల భారీ బైక్ ర్యాలీ
కనిగిరి: ఏపీ రాజధాని అమరావతి బిల్లుకు పార్లమెంటులోని లోక్ సభ మరియు రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల గురువారం కనిగిరి పట్టణంలో ఎన్డీఏ కూటమి నాయకులు భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పార్లమెంటులో రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.