సంతనూతలపాడు: చీమకుర్తి లో మహిళ మెడలో తాళిబొట్టు సరుడును చోరీ చేసిన గుర్తుతెలియని దుండగులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
చీమకుర్తి పట్టణంలోని కోటగట్ల వీధి నందు సుధారాణి అనే మహిళ మంగళవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు వ్యక్తులు ఆమె మెడలోని తాళిబొట్టు సరుడును లాక్కుని వెళ్లారు. ఆమె కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. బుధవారం ఈ ఘటనపై బాధిత మహిళ సుధారాణి మీడియాతో మాట్లాడుతూ... చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.