కనిగిరి: పట్టణంలోని మంచి నీటి దొరువు ఆధునీకీకరణ పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునికీకరణ పనులను కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దొరువు ఆధునీకీకరణ పనులను జరుగుతున్న తీరును ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు. దొరవు లో కలుషితమైన నీటిని మొత్తం బయటికి తరలించాలన్నారు. దరువులో వ్యర్ధాలు, పాచిని తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. దొరవు గట్టును బాగు చేయాలని సూచించారు.