కనిగిరి: పట్టణంలో ఈ నెల 6న అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు నూతనంగా నిర్మించిన అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఈనెల 6 వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి సోమవారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గం లోని నలుమూలల నుండి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ విగ్రహ కమిటీ నాయకులకు సూచించారు.