కనిగిరి: టీడీపీ కార్యాలయ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: టిడిపి కార్యాలయ నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా టిడిపి కార్యాలయ నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి బుధవారం పరిశీలించారు. పనుల వివరాలను కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతగా చేపట్టాలన్నారు. స్థానిక టిడిపి నాయకులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించాలని ఆదేశించారు.