రాప్తాడు: రాప్తాడు ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు నాగరాజ్ ఆధ్వర్యంలో అనంతపురంలో సోషల్ మీడియా ప్రతినిధులకు బహుజన బందు పురస్కార ప్రధానం
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం 11:30 నుంచి 3:30 గంటల వరకు రాప్తాడు ఆర్పిస్ వ్యవస్థాపకుడు నాగరాజ్ ఆధ్వర్యంలో సమాజం కోసం పోరాటాలు చేసే సోషల్ మీడియా ప్రతినిధులకు బహుజన బంధు పురస్కార ప్రధానోత్సవం సభ నిర్వహించి సమాజం కోసం సోషల్ మీడియా వేదిక పనిచేస్తున్న ప్రతినిధులను సత్కారం చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఆర్పిఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు మాట్లాడుతూ మూడు జిల్లాలకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే సోషల్ మీడియా ప్రతినిధులను 17 మందిని ఎంపిక చేసుకొని వారందరికీ ఘనంగా సన్మానం చేసి సమాజం పట్ల మరింత బాధ్యతగా పనిచేయాలని కోరడం జరిగిందని నాగరాజు పేర్కొన్నారు.