కనిగిరి: పట్టణంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరిలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ, కనిగిరి డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కార్యక్రమం ప్రారంభించారు. జర్నలిస్టులు, పోలీసులతో కలిసి MLA స్వయంగా సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కడం వల్ల ఉపయోగాలు, ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో వివరించారు.